Saturday, April 30, 2022
DAILY WISDOM - 272 - 28. Everyone Must Work / నిత్య ప్రజ్ఞా సందేశములు - 272 - 28. ప్రతి ఒక్కరూ తప్పక పని చేయండి
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 28. ప్రతి ఒక్కరూ తప్పక పని చేయండి🌻
పౌర సంఘం లేదా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ సమాజం యొక్క మనుగడ మరియు సంక్షేమానికి ఏదైనా సహకరించడం తప్పనిసరి, మరియు ఎవరూ ఏమీ చేయకుండా పని లేకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పని చేయాలి. సమాజానికి సేవ రూపంలో వ్యక్తి యొక్క భాగస్వామ్యం సమాజంలో వ్యక్తిని ఉంచిన స్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది. ఒకరి జీవితంలోని పరిస్థితులు, అతని జ్ఞానం మరియు సామర్థ్యం, అతను చెందిన సమాజం అటువంటి సేవను ఎంతవరకు ఆశించాలో నిర్ణయిస్తుంది. వస్త్రం యొక్క బట్ట అది ఏర్పడే దారపు పోగుల కారణంగా ఎలా ఉంటుందో, సమాజం దాని భాగాల పరస్పర సమన్వయంతో జీవిస్తుంది.
సమాజానికి అవసరమైన ప్రతి దానిని వ్యక్తిగతంగా అందించగల సామర్థ్యం ఏ ఒక్క వ్యక్తికి ఉండదు కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ సామర్ధ్యాన్ని అత్యున్నతంగా ఉపయోగించాలని పురాతన న్యాయ వ్యవస్థ నిర్దేశించింది. సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన మార్గాలను, అవసరాలను విశ్లేషిస్తూ, సామాజిక న్యాయ అధికారులు నిర్దేశక శక్తి, కార్యనిర్వాహక శక్తి, వాణిజ్య శక్తి మరియు శారీరకశక్తి అనే నాలుగు రకాల అవసరాలను వివరించారు. సంస్కృతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర గా పిలవబడే ఇవి , వరుసగా జ్ఞానం, పరిపాలన, వాణిజ్యం మరియు పనిని సూచిస్తాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 272 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 28. Everyone Must Work 🌻
In civic body or society it is obligatory that everyone should contribute something to the survival and welfare of that body, and no one can remain idle, doing nothing. Work everyone must. The participation of the person in the form of service to society is naturally graded according to the station in which the person is placed in society. The circumstances of one's life, one's knowledge and capacity, will decide the quality and the extent to which such a service would be expected by the society to which one belongs. Society lives by the mutual coordination of its constituents, as a fabric of cloth is what it is because of the threads that go to form it.
Since no single individual can be said to have the ability to contribute individually everything that the society would need, the ancient system of law has laid down that each one should share with the social set-up the highest possibility of which one is capable. Analysing the requirements of society as consisting of the necessary ways and means of maintaining and administering society, the law-givers in terms of the social order spelt out such needs as the fourfold blend of directing power, executive power, commercial power and manpower, known in Sanskrit as Brahmana, Kshatriya, Vaishya and Sudra, representing wisdom, administration, trade and work, respectively.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Apr 2022
Friday, April 29, 2022
Osho Daily Meditations - 175. SOMETHING TO SHARE / ఓషో రోజువారీ ధ్యానాలు - 175. పంచుకోవడం
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 175. పంచుకోవడం 🍀
🕉. ప్రేమ అనేది మీకు మరియు మరొకరికి మధ్య ఉన్న సంబంధం. ధ్యానం అనేది మీకు మరియు మీకు మధ్య ఉన్న సంబంధం. ప్రేమ బయటకు దారి, ధ్యానం లోపలికి దారి. ప్రేమ ఒక భాగస్వామ్యం. అయితే అసలు ప్రేమ లేకపోతే ఎలా పంచుకోగలరు? మీరు ఏమి పంచుకుంటారు? 🕉
మనుషుల్లో కోపం ఉంటుంది. మనుషుల్లో అసూయలు ఉంటాయి. మనుషుల్లో ద్వేషం ఉంటుంది, అందుకే ప్రేమ పేరుతో ఈ విషయాలను పంచుకోవడం మొదలుపెడతారు, ఎందుకంటే వాళ్లకు ఉన్నది అదే. ఆ కల ముగిసిన తర్వాత, వాస్తవికత బహిర్గతం అయిన తర్వాత, మీరు మీ ఆ ముసుగులు వేసుకుని ఏమి పంచుకుంటారు? మీరు కలిగి ఉన్న దానిని మీరు పంచుకుంటారు. కోపమైతే కోపం లేకపోతే ఇంకకటి. ఇది నాది అనే ధోరణి ఉన్నట్టయితే, స్వంతం చేసుకోవాలనే తపన ప్రారంభం అవుతుంది. అప్పుడు పోరాటం, సంఘర్షణ తలెత్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ప్రేమ ముసుగులలో ఇతరుల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తారు.
ధ్యానం మీరు పంచుకో గలిగేది మీకు అందిస్తుంది. ధ్యానం మీకు గుణాన్ని ఇస్తుంది. జీవనంలో మీరు ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రేమగా మారవచ్చు. మామూలుగా ఆ గుణం నీకు ఉండదు. ఎవరికీ అది లేదు. మీరు దానిని సృష్టించాలి. ప్రేమ అనేది మీకు పుట్టుకతో రాదు. ఇది మీరు సృష్టించ వలసిన విషయం; అది మీరు అవ్వవలసిన విషయం. ఇది ఒక పోరాటం, ఒక ప్రయత్నం మరియు గొప్ప కళ. మీలో పొంగిపొర్లుతున్న ప్రేమ ఉన్నప్పుడు, మీరు పంచుకోవచ్చు. కానీ మీరు మీతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ధ్యానం అనేది మీతో మీరు సంబంధం కలిగి ఉండడాన్ని నేర్చుకోవడం తప్ప మరొకటి కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 175 🌹
📚. Prasad Bharadwaj
🍀 175. SOMETHING TO SHARE 🍀
🕉 Love is a relationship between you and somebody else. Meditation is a relationship between YOU and you. Love is outgoing, meditationis ingoing. Love is a sharing. But how can you share love if you don't have it in the first place? What will you share? 🕉
People have anger, people have jealousies, people have hatred, so in the name of love they start sharing these things, because that's what they have. Once the honeymoon is over and you put down your masks, and the reality is revealed, then what will you share? You willshare that which you have. If anger, then anger, if possessiveness, then possessiveness. Then there is fighting and conflict and struggle, and each tries to dominate the other.
Meditation will give you something you can share. Meditation will give you the quality, the energy that can become love when you are related to somebody. Ordinarily you don't have that quality. Nobody has it. You have to create it. Love is not something you are born with. It is something that you have to create; it is something that you have to become. It is a struggle, an effort, and a great art. When you have overflowing love within you, then you can share. But that can happen only when you can relate to yourself. And meditation is nothing but learning to relate to yourself.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Apr 2022
Thursday, April 28, 2022
DAILY WISDOM - 271 - 27. The First in the Kingdom of God / నిత్య ప్రజ్ఞా సందేశములు - 271 - 27. దేవుని రాజ్యంలో మొదటిది
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 27. దేవుని రాజ్యంలో మొదటిది 🌻
మనిషి యొక్క పౌర కర్తవ్యం అనేది ప్రజల మరియు ప్రపంచం యొక్క పర్యావరణం పట్ల ఒక వ్యక్తికి కలిగి ఉండవలసిన ప్రాథమిక పరిగణన. చుట్టూ ఉన్న సంఘంతో ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండటం మంచిదే. అంతే కాదు, చుట్టుపక్కల వ్యక్తులతో దయతో మరియు సేవాభావనతో ఉండటం మంచిది. దాతృత్వం ఇంట్లో ప్రారంభమైతే, తక్షణ పరిసరాల్లో ప్రేమ మరియు సేవ కూడా ప్రారంభమవుతాయి. ప్రవర్తన యొక్క మంచితనం అనేది ఉన్నత దృక్పథం కలిగివుండటమే కానీ ప్రపంచంలో అందరికీ తెలిసేలా సేవ చేయడం కాదు.
ఒక వ్యక్తికి సంబంధించి, మంచిగా ఉండటం అంటే సేవ యొక్క కేంద్ర బిందువు గా ఉండటమే. అంతే కానీ పరిమానాత్మకంగా ఎంతమందికి సేవ చేశారు అనేది కొలమానం కాదు. మంచితనానికి బహిరంగంగా ఎటువంటి ప్రకటన అవసరం లేదు, అది గుర్తింపును కోరదు, కృతజ్ఞతను సైతం కొరదు. ఎందుకంటే, “ఈ ప్రపంచంలో అధమ స్థితిలో ఉన్నవారు సైతం దేవుని రాజ్యం లో ప్రథములుగా పరిగణించబడతారు." పౌర బాధ్యతలు మానవ స్వభావం నుండే ఉత్పన్నమవుతాయి. పౌర బాధ్యతలు తాము స్వీకరించదలచిన మరియు అన్నింటితో పెనవేసుకున్న మానవ అవసరాల నుంచే పుట్టాయి. క్రూర మనిషి, కూరగాయల మనిషి, జంతువు మనిషి మరియు నిజమైన మానవుడు, మానవ స్థాయిలో కూడా ఈ వర్గీకరణలు సాధ్యమే.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 271 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 27. The First in the Kingdom of God 🌻
The civic duty of man is a basic common sense consideration that one should have to the environment of people and the world, and it is good to be always friendly with the community around. Not only that, it would be better to be kind and serviceful to persons in the vicinity. If charity begins at home, love and service also start in the immediate neighbourhood. Goodness of behaviour is more a quality of outlook than a quantitative reach of one's actions to distant corners of the world.
To be qualitatively good in respect of even one person would speak more gloriously of that source of service than to be just quantitatively philanthropic to a large number of individuals. Goodness does not require any announcement in public, it does not seek recognition, not even a word of thanks, for, “Is not the least one in this world going to be recognised as the first in the kingdom of God?” Civic obligations arise from human nature itself. They spring from the very needs of human make-up which has connections with different kinds of facility that is expected to be received from the world. The brute man, the vegetable man, the animal man, and the truly human man are classifications possible even at the human level.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Apr 2022
Wednesday, April 27, 2022
Osho Daily Meditations - 174. FUTILITY / ఓషో రోజువారీ ధ్యానాలు - 174. నిరర్థకత
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 174. నిరర్థకత 🍀
🕉. అంతా వ్యర్థమే. దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోతే, మీరు ఎల్లప్పుడూ భ్రమలో ఉంటారు. ప్రతిదీ పనికిరానిది, మరియు జీవితంలో పురోగతి లేదు, మెరుగుదల లేదు, ఎందుకంటే జీవితం శాశ్వతంగా ఉంటుంది. జీవితం ఇప్పటికే పరిపూర్ణంగా ఉంది. 🕉
జీవితాన్ని మరింత పరిపూర్ణంగా మార్చుకోవడానికి మీరు చేసేదంతా వ్యర్థం. కానీ దానిని గ్రహించడానికి సమయం పడుతుంది. మీరు ఇరుక్కుపోయినట్లు అనిపించినప్పుడు, మీరు రెండు పనులు చేస్తారు. మీరు మీ జీవనశైలిని మార్చుకోవచ్చు, ఆపై మళ్లీ కొన్ని రోజులు మీరు కొత్త ఆశలు, కోరికలు మరియు ఆశయాలతో ఉన్నట్టు ఉంటారు. రేపటి అవకాశం మళ్లీ సజీవంగా మారుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత రేపు రాదని మీరు గ్రహిస్తారు, మళ్లీ మీరు ఇరుక్కుపోయారు అని అర్ధం చేసుకుంటారు. ఇలానే మొత్తం విషయం మళ్లీ మళ్లీ పునరావృత్తం అవుతూ ఉంటుంది.
ఇదెలాంటిదంటే మీరు ఒక స్త్రీని లేదా పురుషుడిని ప్రేమించినట్లే. ఆ కల ముగిసిందా, దానితో పాటే ఆ ప్రేమ ముగిసింది. అది ముగిసే సమయానికి, మీరు మళ్లీ మరొకరి కోసం వెతుకుతారు. మీరు ఒక జీవిత కాలం నుండి మరొక జీవిత కాలం వరకు ఈ విధంగా వెళ్ళవచ్చు, కానీ అది సహాయం చేయదు. జీవితంలో జీవితం కోసం సాధించేది ఏదీ లేదని గ్రహించాలి. జీవితం లక్ష్యం ఆధారితమైనది కాదు. జీవితం ఇప్పుడు ఇక్కడ శాశ్వతంగా ఉంది. ఇది ఇప్పటికే పరిపూర్ణంగా ఉంది. దీన్ని మెరుగుపరచడం సాధ్యం కాదు. మీరు దీనిని గ్రహించిన తర్వాత, భవిష్యత్తు లేదు, ఆశ లేదు, కోరిక లేదు, ఆశయం లేదు. మీరు ఈ క్షణంలో నివసిస్తున్నారు; మీరు దానిలో ఉండండి మరియు ఆనందించండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 174 🌹
📚. Prasad Bharadwaj
🍀 174. FUTILITY 🍀
🕉 Everything is futile. One has to understand this. if you don 't understand it, you will always remain in illusion. Everything is futile, and in life there is no progress, no improvement, because life is eternally there. Life is already perfect. 🕉
All that you try to do to make life more perfect is futile, but it takes time to realize it. When you are feeling stuck, you do two things. You can change your lifestyle, and then for a few days again you will be on a honeymoon, with hopes and desires and ambitions, and the possibility of tomorrow again will become alive. But after a few days you realize that tomorrow never comes. Again you are stuck, and the whole thing again becomes a routine.
It is just like when you love a woman or a man. The honeymoon over, the love is over. By the end of the honeymoon, you are again seeking and searching for another. You can go on in this way from one honeymoon to another, but it is not going to help. You have to realize that there is nothing to achieve in life. Life is not goal oriented. Life is eternally here now. It is already perfect. It cannot be improved upon. Once you realize this, then there is no future, no hope, no desire, and no ambition. You live this moment; you enjoy and delight in it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Apr 2022
Tuesday, April 26, 2022
DAILY WISDOM - 270 - 26. To work for the salvation is the greatest of all services / నిత్య ప్రజ్ఞా సందేశములు - 270 - 26. మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది.
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 26. మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. 🌻
'నిన్నులాగే నీ పొరుగువానిని ప్రేమించు' అనే సూక్తి చుట్టూ తిరుగుతున్న ప్రసిద్ధ కార్యక్రమం చాలా విస్తృతమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. పొరుగువారిని ఎందుకు ప్రేమించాలి? వేదాంత తత్వశాస్త్రం ఎలా సమాధానం ఇస్తుందంటే : 'ఎందుకంటే నీ పొరుగువాడు కూడా నీ స్వయమే కాబట్టి.' ఇక్కడ ఇరుగుపొరుగు అని పిలువబడే మరొక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి యొక్క బాధ్యత, ఆ వ్యక్తి యొక్క స్వయాన్ని తనలో ఎంతవరకు గుర్తించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మానవాళికి అత్యున్నతమైన సేవ చేసేవారు తమ ముందు అనేక మంది వ్యక్తులను చూసి వారికి సేవ చేయాలనే సామాజిక మరియు రాజికీయ ఆవశ్యకము చూడకుండా అందరూ తనలో భాగమే అనే నిగూఢమైన విషయాన్ని దర్శిస్తారు.
మానవజాతి యొక్క ఆధ్యాత్మిక నాయకులు మాత్రమే వారి ఆత్మల పరంగా ప్రజలకు గొప్ప సేవను అందించగలరు, అయితే సాధారణ సామాజిక-సంక్షేమ పథకాలు మానవాళి అవసరాల యొక్క అంచుని మాత్రమే తాకగలవు. ఆహారం, దుస్తులు, నివాసం మరియు వైద్య సహాయంతో శరీరానికి సేవ చేయడం నిజంగా మంచిదే, కానీ మానవుని గౌరవాన్ని దైవత్వ చిహ్నంగా గుర్తించడం ద్వారా ప్రజలను విద్యావంతులను చేయడం మరియు వారిలో విశ్వాసం కలిగించడం మెరుగైన సేవ. ఆత్మ యొక్క మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. సాధువులు మరియు ఋషులు, వారి శక్తివంతమైన ఆలోచనలు మరియు ఏకాగ్రమైన భావాలతో, భౌతిక నేత్రాలతో చూడలేని సేవను అందిస్తారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 270 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 26. To work for the salvation is the greatest of all services 🌻
The well-known programme revolving round the dictum, “Love thy neighbour as thyself,” has far-reaching implications. Why should one love one's neighbour? The Vedanta philosophy would give the answer: “Because thy neighbour is thy own self.” The responsibility of a person to another person, who is here called the neighbour, depends on the extent to which one recognises in the person of another the essence of one's own self. Those who render the greatest service to mankind are people who do not merely behold in front of them a multitude of persons and feel a social obligation or a political necessity to be considerate and serviceful to them, but those in whom a deeper impulse is welling up to see their own selves in all.
The spiritual leaders of mankind alone can render the greatest service to people in terms of their very souls, while the common social-welfare projects can touch only the fringe of humanity's needs. To serve the body with food, clothing, shelter and medical attention is indeed good, but a better service would be to educate people and make them confident in themselves with the recognition of the dignity of man as an emblem of divinity. To work for the salvation of the soul is the greatest of all services. The saints and sages, with their powerful thoughts and concentrated feelings, render a service which cannot be seen with the physical eyes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Apr 2022
Sunday, April 24, 2022
Osho Daily Meditations - 173 / ఓషో రోజువారీ ధ్యానాలు - 173
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 173. జీవితం ఒక ఆట 🍀
🕉. జీవితం అనే ఆటలో మీ పాత్రను పోషించండి. పాత్ర పోషణను ఆనందించండి; అయితే తేలిగ్గా తీసుకోండి. దాని గురించి చింతించడం విలువైనది కాదు. 🕉
ఒక నిర్దిష్ట పరిస్థితిలో మీరు ఏ పాత్ర పోషించవలసి వచ్చినా, దానిని మీ అత్యంత సామర్థ్యంతో పోషించండి, పూర్తిగా ఆడండి. కానీ అది పూర్తయిన తర్వాత, మీరు విజయం సాధించారా లేదా విఫలమయ్యారా అనేది అప్రస్తుతం. వెనక్కి తిరిగి చూడవద్దు; ముందుకు వెళ్ళండి. మీరు పోషించాల్సిన ఇతర పాత్రలు ఉన్నాయి. వైఫల్యం మరియు విజయం ముఖ్యం కాదు. ప్రతిదీ ఒక ఆట అనే అవగాహన ముఖ్యం. మీ జీవితమంతా ఈ అవగాహనతో నిండినప్పుడు, మీరు విముక్తి పొందుతారు, ఏదీ మిమ్మల్ని బంధించదు, మీరు ఇకపై దేనితోనూ ముడిపడి ఉండరు.
అప్పుడు మీరు ఇకపై దేని చేత బంధించబడరు. మీరు ముసుగులు వాడతారు, కానీ అవి మీ అసలు ముఖం కాదని మీకు తెలుసు. మరియు మీరు ముసుగుని తీసివేయవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది ఏమిటో మీకు తెలుసు. ఇది తొలగించదగినది. అప్పుడు మీరు మీ అసలు ముఖాన్ని కూడా తెలుసుకోవచ్చు. జీవితం అంటే ఆట అని తెలిసిన వాడికి అసలు ముఖం తెలుస్తుంది. ఒకరు తన అసలు ముఖాన్ని తెలుసుకోవడం అంటే తెలుసుకోవలసినది తెలుసుకోవడం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 173 🌹
📚. Prasad Bharadwaj
🍀 173. A GAME 🍀
🕉 Play your role, enjoy it; it is fun. But take it lightly. It is not worth worrying about. 🕉
Whatever role you have to play in a certain circumstance, play it to your utmost ability, play it totally. But once it is finished, whether you have succeeded or failed is irrelevant. Don't look back; move ahead. There are other roles you have to play. Failure and success are unimportant. What is important is the awareness that everything is a game. When your whole life becomes full of this awareness, you are freed, nothing binds you, you are no longer tethered to anything.
Then you are no longer imprisoned by anything. You use masks, but you know that they are not your original face. And you can remove the mask, because now you know it for what it is. It is removable. And now you can know your original face too. The one who is aware that life is a game comes to know the original face. And to know one's original face is to know all that is worth knowing.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Apr 2022
Saturday, April 23, 2022
DAILY WISDOM - 269 - 25. What is the Meaning of the Greatest Happiness? / నిత్య ప్రజ్ఞా సందేశములు - 269 - 25. గొప్ప ఆనందం అంటే ఏమిటి?
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 25. గొప్ప ఆనందం అంటే ఏమిటి? 🌻
నైతిక ప్రవర్తనను నిర్వచించే సౌఖ్య ప్రాముఖ్యమైన మరియు కార్యప్రాముఖ్యమైన సిద్ధాంతాలు సకల ప్రాణుల సుఖాన్ని లేదా అందరికీ ఉపయోగపడే తత్వాన్ని నైతిక ప్రవర్తనకు కొలమానాలుగా చూపాయి. కానీ ఈ సిద్ధాంతాలలో కొన్ని లోపాలు ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న వ్యక్తులు అత్యున్నత ఆనందాన్ని పొందాలని చెప్పడం అంటే ఏమిటి? ఈ అతిపెద్ద సంఖ్యలో ఎంత మందిని చేర్చాలి? బహుశా, ప్రపంచంలోని మొత్తం మానవ జాతులను చేర్చాలి. అయితే ప్రపంచంలోని ప్రతి మనిషి సమానంగా సంతోషంగా ఉండే పరిస్థితిని ఊహించడం సాధ్యమేనా?
రెండవది, 'అత్యంత ఆనందం' అంటే ఏమిటి? ఎవరైనా దాని పరిమితిని ఎక్కడ చేరుకుంటారు? శరీరం యొక్క ఆనందాల కంటే మనస్సు యొక్క ఆనందం గొప్పదని స్పష్టమవుతుంది, ఇది వివరణ అవసరం లేని స్పష్టమైన వాస్తవం. కానీ, మానసిక తృప్తి కంటే ఆత్మ యొక్క ఆనందం గొప్పది కాదా? అత్యున్నత ఆనందం యొక్క మన గణనలో మనం నిజంగా ఎక్కడికి చేరుకుంటాము? ఉపనిషత్తు యొక్క ప్రసిద్ధ అభిప్రాయం ఏమిటంటే, మొత్తం భూమికి పాలకుడు ఉన్నాడని అనుకుందాం, ఎవరూ తన సాటి రాని , యవ్వనస్థుడు, ఆరోగ్యవంతుడు, విద్యావంతుడు మరియు సంస్కారవంతుడు, మంచివాడు మరియు ప్రజలందరికీ ప్రియమైనవాడు-అలాంటి వ్యక్తి ఉన్నాడని ఊహించవచ్చు. ఎప్పుడైనా-అటువంటి వ్యక్తి యొక్క ఆనందాన్ని ఉపనిషత్తు ఒక యూనిట్ ఆనందంగా పరిగణించింది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 269 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 25. What is the Meaning of the Greatest Happiness? 🌻
The hedonistic and utilitarian doctrines of ethics which make out that the quantum and kind of happiness available to the largest number of persons is the principle of ethical goodness, or that the extent of utility in life is what determines conduct, have a flaw in their doctrines. What does one mean by saying that the largest number of people should have the greatest happiness? How many people are we to include within this largest number? Perhaps, the entirety of the human species in the world. But is it possible to imagine a state of affairs where every human being in the world is equally happy?
Secondly, what is the meaning of ‘the greatest happiness'? Where does one reach its limit? It is clear that the happiness of the mind is superior to the pleasures of the body, an obvious fact which does not require an explanation. But, is not the joy of the spirit greater than even mental satisfaction? Where do we actually land ourselves in our computation of the greatest form of happiness? It is the famous opinion of the Upanishad that, supposing there is a ruler of the whole Earth, uncontested by anyone, youthful, healthy, educated and cultured, good and loved by all people—if such a person can be imagined to be existing at any time—the happiness of such a person would be one unit of happiness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
23 Apr 2022
Friday, April 22, 2022
Osho Daily Meditations - 172. PLAY / ఓషో రోజువారీ ధ్యానాలు - 172. నాటకము
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 172. నాటకము 🍀
🕉. ఒక నాటకంలోని అన్ని పాత్రలను బాగా పోషించగల సామర్థ్యం మీకు వచ్చినప్పుడు, మీరు వాటి నుండి విముక్తి పొందుతారు. 🕉
పాత్రను పోషించడంలో ఇబ్బంది ఏమిటి? మీరు మరొక పాత్రతో స్థిరపడినందున కష్టం వస్తుంది. అది మీ వ్యక్తిత్వం అని మీరు అనుకుంటారు. మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు మరియు మీరు దానితో చాలా గుర్తింపు పొందారు కనుక వేరే పాత్ర అసాధ్యం అనిపిస్తుంది. మీరు గతం నుండి మిమ్మల్ని మీరు వదిలించుకొని, మీ కొత్త పాత్రలోకి వెళ్లగలగాలి. కొత్త పాత్రల్లోకి సులువుగా వెళ్ల గలడమే ఇక్కడ విశేషం. ఆలోచించండి - ఇది కేవలం ఒక పాత్ర, మీరు ఆడుతున్న ఆట. మీ ఆత్మ సారానికి వ్యక్తిత్వం లేదు, పాత్రలు లేవు. ఇది అన్ని పాత్రలను పోషించగలదు.
దానికి ఒక స్థిరమైన పాత్ర అంటూ ఏమీ లేదు. అదే అంతర్గత స్వేచ్ఛను అందంగా చేస్తుంది. కాబట్టి కేవలం నటుడిగా ఉండండి. ఒక సినిమాలో ఒక నటి ఒక పాత్ర, మరో సినిమాలో మరో పాత్ర పోషిస్తున్నది అనుకోండి. బహుశా ఉదయం ఆమె ఒక పాత్రలో, సాయంత్రం మరొక పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఆమె కేవలం ఒక పాత్ర నుండి మరొక పాత్రకు జారిపోతుంది - అప్పుడు ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే ఇది కేవలం నటన అని ఆమెకు తెలుసు. జీవితమంతా ఇలాగే ఉండాలి. ఏదీ ఒకరిని పూర్తిగా పట్టుకోలేనంతగా పాత్రల్లోకి, పాత్రల నుండి బయటకు జారిపోయేంత సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడు మీరు మీలో స్వేచ్ఛను అనుభవించడం ప్రారంభిస్తారు. మీ నిజమైన సారాన్ని మీరు అనుభూతి చెందుతారు. లేకపోతే, మీరు ఎల్లప్పుడూ ఒక పాత్రలో పరిమితమై ఉంటారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 172 🌹
📚. Prasad Bharadwaj
🍀 172. PLAY 🍀
🕉 Once you become capable of playing roles, you become free of them. 🕉
What is the difficulty in playing a role? The difficulty comes because you are fixed with another role and you think that is your personality. You have been playing one role, and you have become so identified with it that a different role seems impossible. You will have to loosen yourself from the past and move into your new role. But it is good to move into new roles. And just think-it is just a role, a game that you are playing. Your essence has no personality. Your essence has no roles. It can play all the roles, but it has no character.
That's what makes inner freedom beautiful. So just be an actor. In one film the actor is playing one role, in another film another role. Maybe in the morning she is in one role, and in the evening she is in another. She simply slips from one role to another--and there is no problem, because she knows it is just acting. All of life should be like that. One should be so capable of slipping in and out of roles in that nothing holds one. You will start feeling a freedom arising in you, and you will start feeling your real essence. Otherwise you are always confined in a role.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
22 Apr 2022
Thursday, April 21, 2022
DAILY WISDOM - 268 - 24. If Everyone Tells only Untruth, It would Lose its Purpose / నిత్య ప్రజ్ఞా సందేశములు - 268 - 24. ప్రతి ఒక్కరు అవాస్తవం మాత్రమే చెబితే, అది దాని ప్రయోజనాన్ని కోల్పోతుంది
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 268 / DAILY WISDOM - 268 🌹
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 24. ప్రతి ఒక్కరు అవాస్తవం మాత్రమే చెబితే, అది దాని ప్రయోజనాన్ని కోల్పోతుంది 🌻
అనేక మంది ఆలోచనాపరులచే ఇది సరైనది లేదా సరైనది కాదు అని నిర్ధారించడానికి మరొక మార్గం కూడా ఉంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మీలాగే ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఊహించండి మరియు అటువంటి ప్రతిపాదన యొక్క పరిణామాలను చూడండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దొంగగా ఉండాలంటే దొంగలా ఉంటారా? అలాంటప్పుడు, దొంగతనం దాని అర్ధాన్ని కోల్పోతుంది, ఎందుకంటే దొంగతనం యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలో దొంగలు కాని వారు కొందరు ఉంటేనే ఉంటుంది. అందరూ అవాస్తవం చెబితే దాని ప్రయోజనం పోతుంది. లోకంలో సత్యం మాట్లాడే కొందరు వ్యక్తులు ఉన్నందున అసత్యానికి ఒక ఉనికి ఉన్నది.
ప్రతి ఒక్కరికీ సంబంధించి అందరూ సమానంగా హింసాత్మకంగా ఉంటే, హింస యొక్క ఉద్దేశ్యం ఓడిపోతుంది. ఒక ప్రవర్తన, లేదా ఉద్దేశ్యాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ స్వీకరించడానికి అనుమతించలేనప్పుడు, అటువంటి విధానాన్ని నైతికత మరియు నైతికత యొక్క ఆశించిన నిబంధనలకు విరుద్ధంగా పరిగణించాలి. పెద్దలు ఈ సందర్భంలో మూడవ సూత్రాన్ని కూడా ముఖ్యమైనదిగా పరిగణించారు. అవి సరైన మరియు న్యాయమైన దాన్ని చేయాలనే వ్యక్తులలో ప్రేరణ యొక్క 'తప్పనిసరి' లక్షణం మరియు సరికాని మరియు అన్యాయం చేయడానికి స్వయంచాలకంగా ఉద్భవించే అంతర్గత అసహ్యం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 268 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 24. If Everyone Tells only Untruth, It would Lose its Purpose 🌻
It was held by Many thinkers that there is also another way in which we can ascertain what is right or proper. Assume, for a while, if you would like everyone in the world to behave in the same way as you, and watch the consequences of such a proposition. Would a thief like that everyone in the world should also be a thief? In that case, theft would lose its meaning, because the significance of theft is in that there are some people in the world who are not thieves. If everyone tells only untruth, it would lose its purpose.
Untruth seems to succeed because there are some persons in the world who speak the truth. If everyone is equally violent in respect of everyone else, the purpose of violence would be defeated. When a conduct, behaviour or intention cannot be permitted to be adopted by everyone in the world, such a policy should be regarded as contrary to the expected norms of ethics and morality. They also held a third principle as important in this case, namely, the ‘imperative' character of the impulsion in people to do what is right and just and an inward abhorrence automatically arising in oneself to do what is improper and unjust.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Apr 2022
Wednesday, April 20, 2022
You and The Guru
"If you touch a bare wire, then you feel nothing. But the moment you insert one end of the wire into a socket and touch, then in a moment your whole system will be full of electric charge and it will be magnetized. Similarly, God is remaining in your whole system. If you can be in contact with a good master, then in a moment of that divine touch your whole system will be full of divine charge. You can see divine light, can hear the divine sound, and also can feel the God movement sensation in the whole body."
20 Apr 2022
Osho Daily Meditations - 171. UNENLIGHTENED LOVE / ఓషో రోజువారీ ధ్యానాలు - 171. అవగాహన లేని ప్రేమ
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 171. అవగాహన లేని ప్రేమ 🍀
🕉. ప్రేమ అంటే స్వేచ్ఛ అని అర్ధం కాదు. అది ఆదర్శం కనుక ఉండాలి అంటాము- ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఎవరినైనా అవగాహనతో ప్రేమిస్తే, అప్పుడే అది ఒక ఆశీర్వాదం. 🕉
ప్రేమ అనేక విధాలుగా విధ్వంసకరం కావచ్చు, ఎందుకంటే ప్రేమ తప్పనిసరిగా అవగాహనను కలిగి ఉండాలని లేదు. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. ఈనాడు నిజంగా చూస్తే తల్లులు తమ పిల్లలను అతిగా ప్రేమిస్తున్నందున వల్లనే ప్రపంచం మొత్తం బాధపడుతోంది. కావాలంటే మానసిక వైద్యులను, మనస్తత్వవేత్తలను అడగండి. ప్రతి మానసిక రుగ్మతను తల్లి-బిడ్డల బంధానికి ఆపాదించవచ్చు అని వారు అంటున్నారు. పిచ్చాస్పత్రిలో ఉన్న చాలా మంది ఈ అవగాహన లేని అతిప్రేమ వల్లే పిచ్చికి గురయ్యి బాధపడుతున్నారు. తండ్రులు ప్రేమిస్తారు, పూజారులు, రాజకీయ నాయకులు ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, కానీ ప్రేమ తప్పనిసరిగా బుద్ధిని కలిగి ఉండాలని లేదు. ప్రేమ బుద్ధిని కలిగి ఉన్నప్పుడు, జ్ఞానంగా అయినప్పుడు, అది కరుణగా వుంటుంది. అప్పుడు అది పూర్తిగా భిన్నమైన నాణ్యతతో ఉంటుంది. అది మీకు స్వేచ్ఛను ఇస్తుంది. దాని పూర్తి విధి స్వేచ్ఛను ఇవ్వడం.
అది స్వేచ్ఛ గురించి మాట్లాడడమే కాదు-మిమ్మల్ని స్వేచ్ఛగా మార్చడానికి మరియు స్వేచ్ఛా మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను నాశనం చేయడానికి అది ప్రతి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రేమ ఉనికిలో ఉంటుంది, కానీ అప్రమత్తంగా లేకపోతే, అది చాలా వినాశకరమైనది. ప్రేమ ఒక్కటి ఉంటే మాత్రమే సరిపోదు. అలా అయితే ప్రపంచం ఇప్పటికే స్వర్గంగా మారిపోయింది. మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తారు, మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ చివరకు ఏమి జరుగుతుంది? ఈ మోహంగా వ్యక్తం అయ్యే ప్రేమ విధ్వంసం తప్ప మరేమీ తీసుకురాదు. మీ ప్రేమ పైకి బానే వున్నట్టు కనబడుతుంది కానీ, మీరు బాగా లేరు. ఎక్కడో అవగాహనలో లోపం ఉంది. అపస్మారక స్థితిలో ఏదో లోతుగా ఉంది, అది మీకు తెలియని విషయాలను సృష్టిస్తుంది. ప్రేమను తిరస్కరించాలని నేను చెప్పను, కానీ ప్రేమకు మొదటి స్థానం ఇవ్వకూడదు. ముందుగా అవగాహన రావాలి. ప్రేమ నీడలా వెంబడించాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 171 🌹
📚. Prasad Bharadwaj
🍀 171. UNENLIGHTENED LOVE 🍀
🕉 Love does not necessarily mean .freedom. It should-that is the ideal. Always remember, if you love somebody with awareness, only then will it be a blessing. 🕉
Love can be destructive in many ways, because love is not necessarily enlightened. A mother loves the child and the whole world is suffering because mothers love their children. Ask the psychiatrists, the psychologists. They say that every neurosis can be reduced to the mother-child relationship. Many people in the insane asylums are suffering from nothing but love. Fathers love their sons, priests love, politicians love. Everybody is loving, but love is not necessarily enlightened. When love is enlightened, it is compassion. Then it is of a totally different quality. It gives you freedom. Its whole function is to give freedom, absolutely.
And not only that it talks about freedom-it makes every effort to make you free and to destroy all the hindrances on the path of freedom. So love can exist, but if it is not very alert, then it is destructive. Love alone is not enough, otherwise the world would already have become a paradise. You love your partner, your partner loves you, but what happens finally? Nothing but destruction. Your love is okay, but you are not okay. Something is there deep down in the unconscious that goes on creating things you are not aware of. I don't say that love should be denied, but love should not come first. Awareness should come first. Love has to follow like a shadow.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2022
Tuesday, April 19, 2022
DAILY WISDOM - 267 - 23. Dharma in Fact, is God in Action / నిత్య ప్రజ్ఞా సందేశములు - 267 - 23. దేవుడి యొక్క చర్యయే ధర్మం
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 23. దేవుడి యొక్క చర్యయే ధర్మం 🌻
ధర్మం స్వేచ్ఛను ఇస్తుంది మరియు స్వేచ్ఛను నియంత్రిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ అవసరం కానీ అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉండడానికి స్వేచ్చను కొంత పరిమితం చేయవలసి ఉంటుంది. సమాజం తన భాగాలను అవసరమైన ప్రాధాన్యతా నిష్పత్తిలో సామరస్య పూర్వకంగా కలపాలి. ఏకత్వం సమస్త విషయాల పరమ ధర్మం కాబట్టి దానిని ఈ వైవిధ్యమైన , విభజించబడిన జీవసముదాయం లోకి ప్రవేశ పెట్టే సిద్ధాంతం కావాలి.
భౌతిక గురుత్వాకర్షణ, రసాయనిక పొందిక, శారీరక ఆరోగ్యం, మానసిక చిత్తశుద్ధి, భావోద్వేగ సమతుల్యత మరియు తార్కిక అనుగుణ్యత, అనేవి జీవుల ఐక్యత యొక్క వివిధ రూపాలు. అనేకంగా విభజించబడిన ఈ భాగాలను అంటిపెట్టి సామూహికంగా పరిపూర్ణత వైపు తీసుకెళ్లే ఈ సూత్రాన్ని ధర్మంగా పిలుస్తారు. ఇది అన్ని చోట్లా మరియు అన్ని సమయాల్లోనూ పని చేస్తుంది. ధర్మం, వాస్తవానికి, కార్యోన్ముఖుడైన దైవం. అనేక విభజన స్థాయిలలో అనేక విధాలుగా వ్యక్తమైన అనంతమే ధర్మం. ధర్మం యొక్క అనుమతి లేకుండా రాజకీయ ఐకమత్యం, సామాజిక శాంతి లేదా వ్యక్తిగత సంతోషం ఏదీ విలువైనది కాదు, సాధించలేము కూడా. ఇది సమానత్వం మరియు న్యాయం యొక్క నిష్పాక్షికమైన సూత్రం. ఏ విధమైన మత ఆరాధనలతో, విశ్వాసాలతో దీనిని పోల్చలేము.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 267 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 23. Dharma in Fact, is God in Action 🌻
Dharma is the law that grants freedom and also restrains freedom at the same time. While it is necessary to give freedom to everyone, it is also necessary to limit everyone's freedom to the extent to which everyone else also needs freedom equally. Society has to cohere into a harmonious blending of all its parts in the requisite proportion of emphasis on each particular part. Since unity appears to be the law of all things, there has to be some principle of action that insists on its introduction, in the manner necessary, amidst the diversity of isolated things and human beings apparently divided among themselves.
Physical gravitation, chemical coherence, physiological health, mental sanity, emotional balance, and logical consistency, are various forms of the working of the unity of all life. This principle, this rule of the cohesion of divided parts into the pattern of perfection, is dharma, which inexorably works everywhere, and, at all times. Dharma, in fact, is God in action, the Absolute revealing itself in and through its manifestations by degrees of concrescence and division. Nothing worth the while, political solidarity, social peace or personal happiness, can be achieved without the sanction of dharma, which is an impersonal law of equity and justice, not to be confused with any form of cult, creed, faith or religion.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Apr 2022
Monday, April 18, 2022
Osho Daily Meditations - 170. SADNESS / ఓషో రోజువారీ ధ్యానాలు - 170. విచారం
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 170. విచారం 🍀
🕉. విచారంగా ఉన్నప్పుడు, నిజంగా విచారంగా ఉండండి, విచారంలో మునిగిపోండి. విచారం అవసరం. ఇది చాలా విశ్రాంతిగా ఉంటుంది. మిమ్మల్ని చుట్టుముట్టే చీకటి రాత్రి అది. అందులో పడుకో. దాన్ని అంగీకరించండి, మరియు మీరు విచారాన్ని అంగీకరించిన క్షణం, అది అందంగా మారడం ప్రారంభిస్తుంది. 🕉
మనము విచారంగా ఉండడాన్ని తిరస్కరించుట వలన కలిగే దుఃఖము వికారమైనది; మీరు దానిని అంగీకరించిన తర్వాత, అది ఎంత అందంగా ఉందో, ఎంత విశ్రాంతిగా ఉందో, ఎంత ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉందో మీరు చూస్తారు. ఎప్పుడూ ఇవ్వలేని ఆనందాన్ని ఇవ్వడానికి దానిలో కావలసినంత సమర్ధత ఉంది. విచారం లోతును ఇస్తుంది. ఆనందం ఔన్నత్యాన్ని ఇస్తుంది. విచారం మూలాలను ఇస్తుంది. ఆనందం శాఖలను ఇస్తుంది. ఆనందం అనేది ఆకాశంలోకి వెళ్లే చెట్టు లాంటిది, మరియు దుఃఖం అనేది భూమి యొక్క గర్భంలోకి వెళ్లే వేర్లు లాంటిది. రెండూ అవసరమే. చెట్టు ఎంత ఎత్తుకు వెళుతుందో, అది ఏకకాలంలో లోతుగా వెళుతుంది. చెట్టు ఎంత పెద్దదైతే దాని మూలాలు అంత పెద్దవిగా ఉంటాయి. నిజానికి, ఇది ఎల్లప్పుడూ సరైన నిష్పత్తిలో ఉంటుంది. అది దాని సహజ సంతులన.
మీరు సంతులనాన్ని తీసుకురాలేరు. మీరు తెచ్చిన సంతులన వల్ల ఉపయోగం లేదు. ఇది బలవంతంగా ఉంటుంది. సంతులనం ఆకస్మికంగా వస్తుంది; ఇది ఇప్పటికే ఉంది. నిజానికి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీరు అలసి పోయేంత ఉత్సాహంగా ఉంటారు. మీరు చూసారా? గుండె వెంటనే ఇతర దిశలో కదులుతుంది, మీకు విశ్రాంతి ఇస్తుంది. మీరు దానిని విచారంగా భావిస్తారు. మీరు చాలా ఉత్సాహంగా ఉన్నందున ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఇది ఔషధం మరియు చికిత్స. పగటిపూట కష్టపడి రాత్రిపూట గాఢనిద్రలోకి జారుకున్నట్లే. ఉదయం మీరు మళ్లీ తాజాగా ఉన్నారు. గాఢ విచారం తర్వాత మీరు మళ్లీ తాజాగా ఉంటారు, ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉంటారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 170 🌹
📚. Prasad Bharadwaj
🍀 170. SADNESS 🍀
🕉 When sad, be really sad, sink into sadness. What else can you do? Sadness is needed. It is very relaxing, a dark night that surrounds you. Fall asleep into it. Accept it, and you will see that the moment you accept sadness, it starts becoming beautiful. 🕉
Sadness is ugly because of our rejection of it; it is not ugly in itself. Once you accept it, you will see how beautiful it is, how relaxing, how calm and quiet, how silent. It has something to give that happinesscan never give. Sadness gives depth. Happiness gives height. Sadness gives roots. Happiness gives branches. Happiness is like a tree going into the sky, and sadness is like the roots going down into the womb of the earth. Both are needed, and the higher a tree goes, the deeper it goes, simultaneously. The bigger the tree, the bigger will be its roots. In fact, it is always in proportion. That's its balance.
You cannot bring the balance. The balance that you bring is of no use. It will be forced. Balance comes spontaneously; it is already there. In fact, when you are happy, you become so excited that it is tiring. Have you watched? The heart immediately moves then into the other direction, gives you a rest. You feel it as sadness. It is giving you a rest, because you were getting too excited. It is medicinal, therapeutic. It is just as in the day you work hard and in the night you fall deeply asleep. In the morning you are fresh again. After sadness you will be fresh again, ready to be excited.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2022
Sunday, April 17, 2022
DAILY WISDOM - 266 - 22. The Experience of Meditation / నిత్య ప్రజ్ఞా సందేశములు - 266 - 22. ధ్యానం యొక్క అనుభవం
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 22. ధ్యానం యొక్క అనుభవం 🌻
అంతకుముందు భౌతిక శరీరం లోపల బంధించబడిన చైతన్యం వ్యక్తిత్వం ద్వారా కొంచెం కొంచెం గా ప్రకటించుకుని చివరకు ఆ వ్యక్తిత్వ పరిమితులను చేదించి విశాలంగా ప్రకటించ బడుతుంది. అప్పుడు లోపల ఒక శక్తిని అనుభూతి చెందుతారు. బాహ్య పరిస్థితులపై ఒక నియంత్రణను అనుభూతి చెందుతారు. పొందవలసిన దాన్ని పొందామని, జరగవసింది జరింగిందని, తెలుసుకో బడాల్సింది తెలుసుకున్నామనే తృప్తి అనుభూతి చెందుతారు.
ఇంద్రియాలు శరీరంపై తమ పట్టును వదులుకోవడం ప్రారంభిస్తాయి. కేవలం తమ భౌతిక బాధ్యతలే కాక తమ దివ్య దైవీ బాధ్యతలను తెలుసుకుని దైవీ శక్తి తమ ద్వారా ఆ ధ్యని యొక్క వ్యక్తిత్వంలోకి ప్రవహించే సాధనాలుగా మారతాయి. సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, ఆకాశం, విశ్వం మరియు కాలం, తాము నిజంగా భౌతిక దూరాలలో లేవని, తమ అంతర్గత సాన్నిహిత్యాన్ని, సకల సృష్టితోను , తన స్వీయ వ్యక్తిత్వం తోను ఉన్న సంబంధాన్ని ధ్యాని ముందుంచుతాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 266 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 22. The Experience of Meditation 🌻
The consciousness which earlier was locked up within the physical body begins to peep through the apertures of the localised individuality, and beholds itself in persons and things beyond the limits of the single body to which it was shackled. There is then a sense of power felt within, a feeling of control over outer conditions, and a satisfaction that one has obtained what is required to be obtained, done what is to be done, and known what is to be known.
The sense organs begin to loosen their clutches over the body and, loosening themselves from their bodily locations, relate themselves to the divinities behind their operations, becoming thereby channels of the flow of super-physical forces that enter the personality of the meditating individual. The sun and the moon and the stars, the very sky, and all space and time, slowly open up the secret of their really not being situated in large physical distances and of their internal intimacy and organic connection with the very spot and the very personality of the meditating individual.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Apr 2022
Saturday, April 16, 2022
Osho Daily Meditations - 169. SCRIPTURES / ఓషో రోజువారీ ధ్యానాలు - 169. గ్రంథాలు
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 169. గ్రంథాలు 🍀
🕉. మనకి చాలా గొప్పవైన అనేక తత్వశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ అవి మూర్ఖులను ఆక్రమించు కోవడానికి మాత్రమే ఉన్నాయి; అవి నిజమైన అన్వేషకుడి కోసం కాదు. 🕉
నేను చెప్పేది పూర్తిగా సజీవంగా, కొత్తగా, తాజాగా మరియు యవ్వనంగా ఉంది. ఇది సాంప్రదాయం కాదు. ఇది పూర్తిగా భిన్నమైన దృగ్విషయం. ఇది ఇలానే వుండాలి. ఎందుకంటే మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథాలు ఎవరి కోసం వ్రాయబడ్డాయో వారి కోసం ఉద్దేశించబడ్డాయి. ఆ మనస్తత్వశాస్త్రం ప్రపంచంలో ఇప్పుడు పనిచేయదు. నేను సజీవంగా మీకు ప్రతిస్పందిస్తున్నాను; ఆ గ్రంథాలు వారి ప్రజలకు ప్రతిస్పందించాయి. ఆ గ్రంథాలు మీ కోసం వ్రాయబడలేదు. మీకు మరియు ఆ గ్రంథాలకు మధ్య మూడు, నాలుగు, ఐదు వేల సంవత్సరాల అంతరం ఉంది. అవి పూర్తిగా అసంబద్ధం. వారిపై ఆధారపడటం అంటే న్యూటన్ వద్ద ఆగిపోయి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించే వ్యక్తి మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఎప్పటికీ పొందలేనంత అసంబద్ధం.
కానీ గ్రంథాలు జీవించి ఉన్న ప్రజలకు ప్రతిస్పందించ లేవు; అవి పెరగవు. అందుకే పాత రోజుల్లో చాలా మంది మాస్టార్లు తమ సూక్తులను రాసుకోవద్దని, తద్వారా అవి పెరుగుతూనే ఉంటాయని పట్టుబట్టారు. గురువులు తమ సందేశాన్ని తమ శిష్యులకు అందిస్తారు, శిష్యులు వేరే ప్రపంచంలో జీవిస్తారు. గురువులు పోయారు మరియు శిష్యులు తమ స్వంత హక్కులో ఇతరులకు ఏదో బోధించేవారు. వారు చాలా మార్పులు చేస్తారు, ఎందుకంటే ప్రజలు మారారు, పరిస్థితులు మారాయి. కానీ ఒకరు ఒక పుస్తకాన్ని వ్రాసిన తర్వాత అది స్థిరమవుతుంది; అది స్తంభింప జేస్తుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ పుస్తకాన్ని అనుసరించే వారికి చాలా కోపం కూడా వస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 169 🌹
📚. Prasad Bharadwaj
🍀 169. SCRIPTURES 🍀
🕉 There are many scriptures, and much great philosophy,but they are all rubbish! They exist just to let the foolish people get occupied; they are not for the real seeker. 🕉
What I am saying is absolutely alive, new, fresh, and young. It: is not traditional at all, it is a totally different phenomenon-it has to be. Because scriptures that were written three thousand years ago were meant for the people for whom it was written. That psychology no longer functions in the world. I am responding to you; those scriptures responded to their people. Those scriptures were not written for you. There is a gap of three, four, five thousand years between you and those scriptures. They are utterly irrelevant. Relying on them would be as absurd as somebody who studies physics stopping at Newton and never getting to Albert Einstein.
But scriptures can't respond to living people; they can't grow. That's why in the old days many masters insisted that their sayings should not be written down, so that they could keep on growing. The masters would give their message to their disciples, and the disciples would live in a different world. The masters would be gone, and the disciples would be teaching something to other people in their own right. They would make many changes, because the people have changed, situations have changed. But once you write a book it becomes fixed; it becomes frozen. Nobody can change it, and if somebody does, then the followers of the book will become very angry.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
16 Apr 2022
Friday, April 15, 2022
13 Ray Energies
The Rays are an integral part of the Masters teachings and they bring through the source energy for us all.
Here we explain the qualities of each of the 13 rays and the Ascended Masters who are connected too and working with that Energy.
By connecting and working with the 13 Rays, YOU can receive the flow of each Master’s qualities. Each of us is born under a particular Ray, which is part of our DNA and highlights some of the key qualities about our life path & our inner qualities and shows us which Master is working with us.
By connecting too the Master’s and the Ray, receiving the information and downloading the colour coding from the teachings of the Master’s into each of us, we may reach master-hood on earth as it was in Atlantis. The vibration of the 13 Rays are raising this higher potential for our mastery and our planet more than ever before with the sacred teachings of the rays.
As you learn about the 13 Rays and the Masters who you are working with mostly, and understand the rays qualities and their colours, you’ll begin to notice the qualities and feel the energy.
15 Apr 2022
DAILY WISDOM - 265 - 21. Man Lives to Strive Towards the Attainment of Moksha / నిత్య ప్రజ్ఞా సందేశములు - 265 - 21. మోక్ష సాధన కోసం మనిషి జీవిస్తాడు
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 21. మోక్ష సాధన కోసం మనిషి జీవిస్తాడు 🌻
మానవుడు, చివరకు మోక్షసాధనకి కృషి చేయడానికి జీవిస్తాడు. ఏది ఏమైనప్పటికీ, శరీరం మరియు మనస్సు యొక్క సంకెళ్ళలో బందీ అయిన ముముక్షువు ఈ విషయంలో ఏమి చేయాలనే దానిపై కొంత శ్రద్ధ వహించాలి. భౌతిక శరీరానికి దాని భౌతిక అవసరాలు ఉన్నాయి మరియు మనస్సుకు దాని భావోద్వేగాలు ఉన్నాయి. మోక్షసాధన ఈ భౌతిక మరియు అభౌతిక అవసరాలను సైతం పరిగణన లోకి తీసుకుంటుంది. భౌతిక అవసరాలు, భౌతిక శరీరం యొక్క మనుగడకు అవసరమైన ఆస్తులు అర్థం పరిధిలోకి వస్తాయి.
ఆహారం, దుస్తులు మరియు నివాసం జీవనానికి అవసరమైన కనీసావసరాలు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది, అంతిమ స్వేచ్ఛను సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని వాస్తవంగా ఒప్పుకొని శ్రద్ధ వహించాలి. శరీరం ఆత్మ కానందు వల్ల దాని పట్ల శ్రద్ధ వహించక పోవడం జరగకూడదు. ఎందుకంటే మిథ్య అయినప్పటికీ చైతన్యం దాన్ని ఎంత ఆమోదించి తనలోకి స్వీకరిస్తున్నదో అంత సత్యంగా అది మారుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 265 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 21. Man Lives to Strive Towards the Attainment of Moksha 🌻
Man lives, finally, to strive towards the attainment of moksha. Nevertheless, the aspiring human individual involved in the shackle of body and mind has to pay some attention to what exactly is to be done while actually involved in this manner. The physical body has its material needs and the mind has its emotional calls. The working for moksha is also to take into account these lesser psychophysical requirements. The physical needs come under the realm of artha, including material possessions necessary for the survival of the physical body.
Food, clothing and shelter are the barest minimum necessary for the continuance of life. Everyone has the right to live, even as everyone has a duty to achieve ultimate freedom. Further, a phenomenon presented as a content of experience should be considered as real enough to call for concerted attention. That the body is not the soul does not preclude the necessity to pay due attention to the demands of the body, for even a phenomenon not finally real assumes a reality to the extent it is received and accepted into the constitution of consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Apr 2022
Thursday, April 14, 2022
Osho Daily Meditations - 168. HIBERNATION / ఓషో రోజువారీ ధ్యానాలు - 168. నిద్రాణస్థితి
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 168. నిద్రాణస్థితి 🍀
🕉. కొన్నిసార్లు మీరు నిదానంగా, చల్లగా, కొన్నిసార్లు చలాకీగా, వెచ్చగా ఉంటారు. దాన్ని సమస్యగా చేసుకోవద్దు. నిద్రాణస్థతిలో ఉన్నప్పుడు దాని గురించి అపరాధ భావంతో ఉండకండి. 🕉
శరీరం ఇరవై నాలుగు గంటలు వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. అది అలసిపోతుంది. దానికి కొంచెం విశ్రాంతి కావాలి. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, శక్తి లోపలికి కదులుతుంది; మీరు వెచ్చగా, చలాకీగా ఉన్నప్పుడు, శక్తి బయటికి కదులుతుంది. వాస్తవానికి, ఇతర వ్యక్తులు మీరు ఎల్లప్పుడూ వెచ్చగా, చలాకీగా ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే మీ శక్తి వారి వైపు కదులుతుంది. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, మీ శక్తి వారి వైపు కదలదు, కాబట్టి వారు మనస్తాపం చెందుతారు. మీరు చల్లగా ఉన్నారని వారు అంటారు. అయితే అది మీరే నిర్ణయించు కోవాలి. మీరు నిద్రాణస్థితిలో ఉన్న ఆ చల్లని క్షణాలలో, మీరు మీ ఉనికిలోకి వెళతారు. అవి ధ్యాన క్షణాలు.
కాబట్టి ఇది నా సూచన - మీకు అలా అనిపించినప్పుడు, బాహ్య సంబంధాల తలుపులు మూసి వేయండి. బయటి వ్యక్తులతో కలిసి ఉండవద్దు. మీరు చల్లగా, నిదానంగా ఉన్నారని అనిపించినప్పుడు, ఇంటికి వెళ్లి ధ్యానం చేయండి. ధ్యానం చేయడానికి అదే సరైన సమయం. శక్తి స్వతహాగా ఆ విధంగా కదులుతున్నప్పుడు, మీరు దానిపై ప్రయాణించవచ్చు. దానితో పాటు మీ జీవి యొక్క అంతర్భాగానికి వెళ్లవచ్చు. పోరాటం ఉండదు. అలాగే మీరు చలాకీగా, వెచ్చగా ఉన్నప్పుడు, బయటకు వెళ్లండి. ఆ సమయంలో ధ్యానం గురించి మర్చిపోండి. ప్రేమగా ఉండండి. రెండు స్థితులను తెలివిగా ఉపయోగించండి. వీటి గురించి అనవసరంగా చింతించకండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 168 🌹
📚. Prasad Bharadwaj
🍀 168. HIBERNATION 🍀
🕉 Sometimes you are cold; sometimes you are not. Don't create a problem out if it. When cold, be cold, and don't feel guilty about it. 🕉
There is no need to remain warm for twenty-four hours. That would be tiring. One needs a little rest. When you are cold, the energy is moving inward; when you are warm, the energy is moving outward.Of course, other people would like you always to be warm, because then your energy moves toward them. When you are cold, your energy is not moving toward them, so they feel offended. They will tell you that you are cold. But it is for you to decide. In those cold moments you hibernate, you go within your being. Those are meditative moments.
So this is my suggestion-when you feel cold, close the doors from relationships and moving with people. Feeling that you are cold, go home and meditate. That is the right moment to meditate. With energy itself moving in, you can ride on it and go to the very innermost core of your being. There will be no fight. You can simply move with the current. And when you are feeling warm, move out. Forget all about meditation. Be loving. Use both states, and don't worry about it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2022
Wednesday, April 13, 2022
DAILY WISDOM - 264 - 20. The Term ‘Moksha' Describes the Final Aim of All Things / నిత్య ప్రజ్ఞా సందేశములు - 264 - 20. ‘మోక్షం’ అనే పదం అన్ని విషయాల అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది.
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 20. ‘మోక్షం’ అనే పదం అన్ని విషయాల అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. 🌻
ప్రజల యొక్క అవసరాలు ఏమిటి? అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ భద్రత అని ఎవరైనా అనవచ్చు. కానీ, ఇది స్థూల స్థాయి నుండి మాత్రమే విషయాలను చూడటం. ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలించిన స్మృతులు, పురాణేతిహాసాలు మానవుల అవసరాలను ధర్మ, అర్ధ కామ మోక్షాలుగా వర్గికరించాయి. ఋషులకు మానవ జీవిత ఆవశ్యకతలపై ఉన్న గొప్ప అంతర్దృష్టికి ఇది నిలువెత్తు ఉదాహరణ. మానవుని పూర్తి అవసరాలను కేవలం ఈ నాలుగు వర్గాలుగా మాత్రమే విభజించవచ్చు.
'మోక్షం' అనే పదం అన్ని విషయాల యొక్క చివరి లక్ష్యాన్ని వివరిస్తుంది. ప్రతి జీవికి ఉండే అనంతమైన కోరికలు ఎక్కడో ఒకచోట ముగియాలి. కోరికలకు దాన్ని నెరవేర్చే అవకాశం లేకుండా అడగడంగా మాత్రమే ఉండదు. ఉన్నత లోకాలను పొందాలనే కోరిక ప్రతి జీవిలో, మరియు మానవులలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కోరికకు సైతం ఏదో ఒక జన్మస్థానం ఉండాలి. ఈ కోరిక సామూహిక ప్రాణ శక్తి ని ధరించే చైతన్యంలో ఉత్పన్నమౌతుంది తప్ప ఇంక ఎక్కడా కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 264 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 20. The Term ‘Moksha' Describes the Final Aim of All Things 🌻
What are the needs of people? One may say that they are social, economic and political security. But, this would be to look at things only from the peripheral level. Ancient Indian thought, recorded in the scriptural texts, such as the Smritis, Epics and Puranas, which have gone into great detail in this field of investigation, has classified the basic requirement in terms of what are known as dharma, artha, kama and moksha. Here is a standing example of the great intuition of the early seers into the essentials of human life.
The four aims stated exhaust the entire area of human aspiration and performance. The term ‘moksha' describes the final aim of all things. The resistless asking, characterising all living beings in a variety of ways, has to end somewhere, sometime. There cannot be only asking without the chance of fulfilling it. An endless asking for wider dimensions which can be seen working vigorously in every living being, and most perspicaciously in human nature, has to have its origin nowhere except in the very consciousness and the very life principle of all beings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Apr 2022
Tuesday, April 12, 2022
Osho Daily Meditations - 167 / ఓషో రోజువారీ ధ్యానాలు - 167
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 167 / Osho Daily Meditations - 167 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 167. పాల్గొనడం 🍀
🕉. మీరు పాల్గొంటేనే తెలుసుకోగల విషయాలు కొన్ని ఉన్నాయి. 🕉
బయటి నుంచి చూస్తే మిడిమిడి విషయాలు మాత్రమే తెలుసు. లోపలి వ్యక్తికి ఏమి జరుగుతోంది? ఎవరో ఏడుస్తున్నారు మరియు కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. మీరు చూడవచ్చు, కానీ ఇది చాలా ఉపరితలంగా ఉంటుంది. అతని హృదయానికి ఏమి జరుగుతోంది? ఎందుకు ఏడుస్తున్నాడు? అర్థం చేసుకోవడం కూడా కష్టం - ఎందుకంటే అతను దుఃఖంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను విచారంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను కోపంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను ఆనందంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను కృతజ్ఞతతో ఏడుస్తూ ఉండవచ్చు. కన్నీళ్లు కేవలం కన్నీళ్లు. కన్నీటి కన్నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడానికి రసాయనికంగా విశ్లేషించడానికి మార్గం లేదు - లోతైన కృతజ్ఞత నుండి, ఆనందకరమైన స్థితి నుండి లేదా దుఃఖం నుండి - అన్ని కన్నీళ్లు ఒకే విధంగా ఉంటాయి. రసాయనికంగా తేడా లేదు.
విదూషకుడి బుగ్గలు చూడండి. వారు ఎల్లప్పడూ ఒకేలాంటి బుగ్గలు కలిగి ఉంటారు. కాబట్టి లోతైన అంశాలకు సంబంధించినంత వరకు, బయటి నుండి చూస్తే ఏదైనా అవగాహనకు రావడం దాదాపు అసాధ్యం. ఒక వ్యక్తిని గమనించడం సాధ్యం కాదు. బాహ్య విషయాలు మాత్రమే గమనించవచ్చు. కానీ మీరు లోపల నుండి తెలుసుకోవచ్చు. అంటే ఆ కన్నీళ్లను లోపల నుండి మీకు మీరే స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవాలి; లేకుంటే మీరు వాటిని నిజంగా ఎప్పటికీ తెలుసుకోలేరు. పరిశీలన ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అందుకని మీరు చూడటం మంచిదే, చాలా బాగుంది. కానీ మీరు పాల్గొనడం ద్వారా నేర్చుకునే దానితో పోలిస్తే ఇది ఏమీ కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 167 🌹
📚. Prasad Bharadwaj
🍀 167. PARTICIPATION 🍀
🕉 There are things that you can know only if you participate. 🕉
From the outside you know only superficial things. What is happening to the inside person? Somebody is crying and tears are flowing. You can watch, but it will be very superficial. What is happening to his heart? Why is he crying? It is difficult even to interpret-because he may be crying out of misery, he may be crying out of sadness, he may be crying out of anger, he may be crying out of happiness, he may be crying out of gratitude. And tears are just tears. There is no way to analyze a tear chemically to find out from where it comes-from deep gratitude, from a blissful state, or from misery-because all tears are the same.
Chemically they don't differ, and they look the same rolling clown the cheeks. So it is almost impossible, as far as the deeper realms are concerned, to conclude from the outside. A person cannot be observed. Only things can be observed. You can know from the within. That means that you have to know those tears your-self; otherwise you will never really know them. Much can be learned by observation, and it is good that you watch, very good. But that is nothing compared to what you can learn by participating.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 2022
Monday, April 11, 2022
DAILY WISDOM - 263 - 19. People Make the Law to Administer People / నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 - 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు 🌻
'సమాజం' అనే పదం స్థూలంగా, వారి ఉమ్మడి భావజాలం, సాంస్కృతిక విలువలు, మతపరమైన దృక్పథం మరియు సంబంధ బాంధవ్యాలు కారణంగా ఒక సమూహం కలిసి రావడం తప్ప మరొకటి కాదు. ప్రశ్న ఏమిటంటే: సమాజం అంటే ప్రతి మానవుని వ్యక్తిగత వ్యక్తిత్వ సమాహారమా లేదా సామూహిక అభౌతిక బంధమా? వారి భాగస్వామ్య సభ్యులు భౌగోళికంగా ఒకరికొకరు దూరంగా జీవించినప్పటికి వారు ఒక సమాజంగా వ్యవహరించ గల్గుతారు. కానీ ఒకే గదిలో కూర్చున్న వ్యక్తుల సమూహం సైతం వారి మధ్య ఒక సామూహిక కారణం లేకపోతే సమాజం అనిపించుకోదు.
వాస్తవానికి, సామూహిక సిద్ధాంతం మాత్రమే సమాజం అని పిలవబడేది, కేవలం వ్యక్తులు కాదు. రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నపటికీ వారు ఒక సమాజంగా పిలవబడరు. అలాంటప్పుడు సమాజం అంటే ఏమిటి? ఒక సమాజం తనకి తాను ప్రభుత్వం వంటి పరిపాలనా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ప్రజల జీవితాన్ని మరియు ప్రవర్తనను సిద్ధాంతపరంగా నిరోధించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి చట్టాలు మరియు నియమాలను రూపొందించవచ్చు. ఎవరిని పరిపాలించడానికి చట్టాన్ని ఎవరు చేస్తారు? ప్రజలను పరిపాలించేందుకే ప్రజలు చట్టం చేస్తారని స్పష్టమవుతోంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 263 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 19. People Make the Law to Administer People 🌻
The word ‘society', for all outward look, would just mean nothing more than a group of people come together on account of their common ideology, cultural values, religious outlook and kindred characteristics which unite them as a bond commonly linking them into the pattern of a whole. The question is: Does society consist of individual personalities, as human beings, or does it consist of the bond mentioned, which is ideational? A society of people can be there even if their constituent members happen to live geographically away from one another, but even a group of people sitting in a single room may not form a society if among them there is nothing to call a common cause.
Actually, the common cause is what can be called society, and not merely the persons. A large number of people travelling in a railway compartment do not necessarily form a society. What then is society? A society can constitute itself into an administrative organisation, such as a government, and frame laws and rules to restrain and order the life and conduct of people. Who makes the law to administer whom? It is clear that people make the law to administer people.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Apr 2022
Sunday, April 10, 2022
Good Wishes on Sri Rama's Birthday - Sri SitaRama Kalyanam - Sri Rama Navami to All శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన ఆశీస్సులు అందరికి
🍀. మనందరి జీవితాలలో ఈ శ్రీరాముని జన్మదినము మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినం ఆనందం, సామరస్యత మరియు సమృద్ధిని తేవాలని కోరుకుంటూ.. 🍀
ప్రసాద్ భరధ్వాజ.
🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏
- పండిత శ్రీరామశర్మ ఆచార్య
🌹 Good Wishes and Blessings on Lord Sri Rama's Birthday - Sri SitaRama Kalyanam - Sri Rama Navami to All 🌹
🍀 Let the Birthday and Shri Ram and Sri SitaRama Kalyanam, bring happiness, harmony and abundance in our life's. 🍀
Not only chanting the name of Rama, but also Let us do the work of Rama. Those who devote their intellect, energy, labor, Time, and Money to the work of God will become great. Hanuman became a god by submitting himself to the work of Rama and fulfilling the task of Rama. Come forward for the work of God. Then we three - you, I, and God become One.
- Pandit Sri Ram Acharya.
🙌🙌🙌
Prasad, Jyothirmayi
10 Apr 2022
Osho Daily Meditations - 166. TRUE STRENGTH / ఓషో రోజువారీ ధ్యానాలు - 166. నిజమైన బలము
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 166. నిజమైన బలము 🍀
🕉 ఒక ఆశ్రయం లేదా రక్షణను కలిగి ఉండటంతో చాలా అనుబంధం ఏర్పడవచ్చు, కానీ అది మీకు బలాన్ని ఇవ్వదు. మీరు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా బలం వస్తుంది. 🕉
పాత రోజుల్లో ప్రజలు మఠాలకు లేదా హిమాలయాల వంటి సుదూర గుహలకు వెళ్లేవారు. వారు అక్కడ కొంత శాంతిని పొందేవారు. కానీ ఆ శాంతి చవకైనది. ఎందుకంటే ఈ వ్యక్తులు ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడల్లా, వారి శాంతి చాలా పెళుసుగా ఉంది కనుక అది వెంటనే పగిలి పోతుంది. వారు ప్రపంచానికి భయపడతారు. కాబట్టి వారి ఒంటరితనం ఒక రకమైన తప్పించుకునే ధోరణి మాత్రమే. పెరుగుదల కాదు.
ఒంటరిగా ఉండటం నేర్చుకోండి, కానీ కేవలం మీ ఒంటరితనంతో మాత్రమే ఎప్పుడూ ముడిపడి ఉండకండి. ఇతరులతో సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండండి. ధ్యానం చేయడం నేర్చుకోండి, కానీ మీరు ప్రేమకు అసమర్థులుగా మారేంత వరకు వెళ్లకండి. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండండి, కానీ ఈ నిశ్చలత్వంతో మరీ ఎక్కువగా నిమగ్నమై పోకండి. లేదంటే మీరు సమాజాన్ని ఎదుర్కోలేరు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం సులభం. ప్రజలతో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం కష్టం. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొని ఒకసారి మీరు ప్రజలలో ఉన్నప్పుడు మౌనంగా ఉండగలిగితే, దాన్ని మీరు సాధించినట్టు. ఇప్పుడు ఆ శాంతిని ఏదీ నాశనం చేయలేదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 166 🌹
📚. Prasad Bharadwaj
🍀 166. TRUE STRENGTH 🍀
🕉 One can become too attached to having a shelter or protection, but that will not give you strength. Strength always comes when you face situations that are hard. 🕉
In the old days people used to move to monasteries and to the Himalayas and to the faraway caves, and they attained to a certain peace there. But that peace was cheap, because whenever these people would come back to the world, it would immediately be shattered. Their peace was so fragile, they would become afraid of the world. So their isolation was a kind of escape, not growth.
Learn to be alone, but never get too attached to your aloneness. Remain capable of relating with others. Learn to meditate, but don't move so far to an extreme that you become incapable of love. Be silent, peaceful, still, but don't get obsessed by this stillness, or you will not be able to face the marketplace. It is easy to be silent when you are alone. It is difficult to be silent when you are with people, but that difficulty has to he faced. Once you are able to be silent with people, you have attained; now nothing can destroy it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Apr 2022
Saturday, April 9, 2022
DAILY WISDOM - 262 - 18. To be Truly Good is an Art / నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 - 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ 🌻
మానవుడు ఎప్పుడూ వస్తువుల యొక్క నిజమైన స్వభావంతో ఆందోళన చెందుతూ ఉంటాడు. కారణం ఇది అసత్యం యొక్క రాజ్యానికి భిన్నంగా సత్య ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. వీటి యొక్క దశలు మా మునుపటి అన్వేషణలలో క్లుప్తంగా గమనించబడ్డాయి - దీనిలో లోతైన మనస్సును సంతృప్తి పరిచే ఒక వ్యవస్థ, సమరూపత, క్రమం, ఒక నమూనా కుండే అందం, ప్రేమ వంటివి కనిపిస్తాయి. సత్యం మన ప్రశంసలను, విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని ఆకర్షిస్తే, అందం ప్రశాంతత, నిగ్రహం మరియు అంతర్గత ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల కళలు సౌందర్య శాస్త్రం యొక్క అధ్యయనం క్రిందకు వస్తాయి. పరిపూర్ణత స్థాయికి తగ్గట్టుగా పద్దతిగా ప్రదర్శించడంలోని నైపుణ్యమే అనేక కళలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది.
మంచిగా రాయడం ఒక కళ, మంచి పరిపాలన ఒక కళ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక కళ, లోలోపల ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఒక కళ, ఒకరి వాతావరణం లేదా పర్యావరణంతో సామరస్యంగా జీవించడం ఒక కళ, తార్కికంగా ఆలోచించడం ఒక కళ. ఇలా అన్నింటిలో మంచి ఒక కళ. ‘సంతృప్తి’ కలిగించే విషయాలన్నీ కళలలో మూర్తీభవించాయి. గొప్ప కళలన్నీ సౌందర్యానికి, ఆనందానికి సంబంధించిన అత్యున్నత వస్తువులు. శిల్పములు, చిత్ర లేఖనాలు ఇలా ప్రాముఖ్యత యొక్క ఆరోహణ క్రమంలో వాటిని పేర్కొనడం మనం చూస్తాం. చిత్రాలు, సంగీతం, నృత్యం, నాటకం, అన్నింటికంటే, సాహిత్యం వంటివి ప్రముఖంగా కనబడతాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 262 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 18. To be Truly Good is an Art 🌻
The human individual is ostensibly concerned with the true nature of things; it loves the world of truth as distinct from the realm of untruth—stages of which have been briefly noticed in our earlier findings—but there is also the love of system, symmetry, order, pattern and beauty which satisfies the mind deeply. While truth attracts our admiration, awe and wonder, beauty evokes a sense of composure, sobriety and inner delight. All kinds of art come under the study of aesthetics. There are indeed many arts: kinds of expertness in methodical presentation to the point of perfection.
Good writing is an art, good administration is an art, maintenance of good health is an art, being always happy within is an art, to live harmoniously with one's atmosphere or environment is an art, to think logically is an art, to be truly good is an art. All things that ‘satisfy' are embodied in art. The greatest arts, supreme objects of aesthetic enjoyment are, to state them in an ascending order of importance, architecture and sculpture; drawing and painting; music, dance and drama; and, above all, literature.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Apr 2022
Friday, April 8, 2022
Osho Daily Meditations - 165. WILD / ఓషో రోజువారీ ధ్యానాలు - 165. ఉద్ధృతం
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 165. ఉద్ధృతం 🍀
🕉. ప్రేమ ఒక ఉద్ధృతి. మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నించిన క్షణం అది మిగలదు. ప్రేమ అనేది స్వేచ్ఛ, ఉగ్రత, మరియు ఆకస్మికత యొక్క సుడిగాలి. 🕉
మీరు ప్రేమను నిర్వహించ లేరు. దానిని నియంత్రించ లేరు. నియంత్రణలో ఉందా, అది చనిపోతుంది. ప్రేమను ఇప్పటికే చంపి ఉంటే మీరు దానిని నియంత్రించ వచ్చు. అది సజీవంగా ఉంటే, అది మిమ్మల్ని నియంత్రిస్తుంది, లేకపోతే కాదు. అది సజీవంగా ఉంటే, అది మిమ్మల్ని కలిగి ఉంటుంది. మీరు దానిలో మిమ్మల్ని పోగొట్టుకుంటారు, ఎందుకంటే అది మీ కంటే పెద్దది, మీ కంటే విశాలమైనది, మీ కంటే ప్రాథమికమైనది, మీకు పునాది. అదే విధంగా దేవుడు కూడా వస్తాడు. దేవుడు కూడా అనంతుడు. దైవం, ప్రేమ అంటే అంతులేని విశాలత్వం. నాగరికత కలిగిన దేవుడు అస్సలు దేవుడు కాదు.
ఆలయ దేవుడు కేవలం విగ్రహం మాత్రమే. దేవుడు చాలా కాలం క్రితం ఆ ప్రదేశాల నుండి అదృశ్యమయ్యాడు, ఎందుకంటే దేవుణ్ణి బంధించ లేరు. మీరు భగవంతుడిని కనుగొనాలను కుంటే, మీరు జీవితంలోని అత్యంత సహజమైన ఉద్ధృతి శక్తికి అందుబాటులో ఉండాలి. ప్రేమ మొదటి సంగ్రహావలోకనం, ప్రయాణం ప్రారంభం. దేవుడు అంతిమం, పరాకాష్ట. కానీ దేవుడు సుడిగాలిలా, ఉప్పెనలా వస్తాడు. అది నిన్ను నిర్మూలిస్తుంది, అది నిన్ను స్వాధీనం చేసుకుంటుంది. అది నిన్ను ముక్కలుగా నలిపేస్తుంది. అది నిన్ను చంపి పునరుత్థానం చేస్తుంది. ఇది ఒకేసారి మరణ రేఖను దాటడం మరియు పునరుత్థానం కూడా.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 165 🌹
📚. Prasad Bharadwaj
🍀 165. WILD 🍀
🕉 Love is wild, and the moment one tries to domesticate it, it is destroyed. Love is a whirlwind of freedom, of wildness, of spontaneity. 🕉
You cannot manage love and control it. Controlled, it is dead. Love can be controlled only when you have already killed it. If it is alive, it controls you, not otherwise. If it is alive, it possesses you. You are simply lost in it, because it is bigger than you, vaster than you, more primal than you, more foundational than you. In the same way God also comes. The same way love comes to you, God comes. God is also wild, wilder than love. A civilized God is no God at all.
The God of the temple is just an idol. God has disappeared from those places long ago, because God cannot be imprisoned. If you want to find God, you will have to be available to the wild energy of life. Love is the first glimpse, the beginning of the journey. God is the climax, the culmination, but God comes as a whirlwind. It will uproot you, it will possess you. It will crush you to pieces. It will kill you and resurrect you. It will be both-the crossing the line of death and the resurrection.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Apr 2022
Thursday, April 7, 2022
DAILY WISDOM - 261 - 17. The Atman is Consciousness Itself / నిత్య ప్రజ్ఞా సందేశములు - 261 - 17. ఆత్మ స్వయంగా చైతన్యమే
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 17. ఆత్మ స్వయంగా చైతన్యమే 🌻
ఉపనిషత్తులు చెప్పే జాగృత స్థితి అనేది స్వప్న మరియు నిద్ర యొక్క స్థితులకు భిన్నంగా మనస్సు యొక్క పారదర్శక కార్యకలాపాన్ని తెలియ చేస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం, మనస్సు స్వయంగా స్వీయ-స్పృహతో ఉండదు కానీ అది నిజమైన ఆత్మ వల్ల ప్రకాశిస్తుంది. మొత్తంగా చూస్తే ఆత్మ మాత్రమే చైతన్యమని, అది మాత్రమే పూర్తి స్పృహలో ఎల్లప్పుడు ఉంటుందనే ఏకైక విషయం స్పష్టం అవుతుంది. నిశ్చయంగా, ఆత్మ స్వయంగా చైతన్యమే అయి వుంది. దాని చైతన్యం మనం మెలకువ స్థితిలో ఉన్నప్పుడు మొత్తం భౌతిక వ్యవస్థలో వ్యాపిస్తుంది, తద్వారా శరీరం కూడా స్పృహలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మెలుకువ సమయంలో, మనం శరీరాన్ని తాకినప్పుడు లేదా మొత్తం శరీరాన్ని మనం అనుభవించినప్పుడు మనం దాని అనుభూతిని, అవగాహనని పొందవచ్చు కదా.
మెలకువ స్థితిలో ఈ చైతన్యమే వస్తువుల యొక్క అవగాహనను, రూపాల యొక్క ముద్రలను దానిలో నిల్వ చేసుకుంటుంది. ఈ ముద్రలు, సంభావ్యతలు మనం వాడే కెమెరా తీసే చిత్రాల మాదిరిగానే ఉంటాయి అనుకోవచ్చు ఉదాహరణకు. చురుకైన అవగాహన జరిగినప్పుడల్లా, ఈ ముద్రలు మన ఉపచేతనా స్థాయిలో ప్రాధమికంగా దొంతర దొంతరలుగా అస్తవ్యస్తమైన సంచితంగా పోగు పడతూ ఉంటాయి. అక్కడ నుండి జీవితం యొక్క అనేక సంభావ్యతల యొక్క కారణాలుగా కొన్ని తిరిగి అనుభవానికి వస్తూ భిన్నమైన, లేదా మరింత స్పష్టమైన అవగాహన రావడానికి దోహద పడతాయి. అలా మరిన్ని ముద్రలు కొత్త అవగాహనతో తయారయి పోగు పడుతూ వుంటాయి. ఉపనిషత్తులలో ఈ మెలుకువ స్థితి, కలలు కనడం మరియు గాఢనిద్ర స్థితులు మనస్సు యొక్క వివిధ పరిస్థితులుగా వివరించబడ్డాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 261 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 17. The Atman is Consciousness Itself 🌻
The Upanishads hold that the waking consciousness is a whole by itself and constitutes a transparent activity of the mind, as contrasted with the states of dream and sleep. To the Upanishads, the mind by itself is not self-conscious and it is illumined by the true self within, the Atman, which is the only thing that is finally conscious; verily, the Atman is consciousness itself. Its consciousness permeates the entire physical system in the waking condition and even the body then appears to be conscious, as we can feel a sensation of awareness, in waking, when we touch the body, or when we experience ourselves as a whole body in that state.
The waking state of consciousness is occupied with perception of objects and storing within itself impressions of the forms of perception. These impressions remain, like the repeated impressions created on the same receiving film of a photographic camera, as impressions piled one over the other as a large mass of chaotic accumulation of potentialities of perception which are driven into the subconscious level when active perception takes place through waking consciousness. The waking, dreaming and deep sleep states are herein explained as conditions of the mind-stuff.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
07 Apr 2022
The most misused word in this world is ‘spirituality’. / ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’.
కొన్నిసార్లు అజ్ఞానం కారణంగా, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని వాడుతున్నారు. సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. అయితే, కొందరి వల్ల అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా, చాలామందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం కలుగుతున్నాయి. ఈ కారణంగానే వారి మనసులో ఎన్నో సందేహాలు ఏర్పడుతున్నాయి.
మన మనసులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ని గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. మానసికమైన ఆలోచనలన్నీ ఆధ్యాత్మికత కాదు. నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలు ఉందని చెబితే ఎలా ఉంటుంది? వేలు ఎప్పుడూ భౌతికమైనదే. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. అంతమాత్రాన అది ఆధ్యాత్మికం కాదు. అది భౌతికం మాత్రమే.
భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గం మాత్రమే. అదే విధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికం కాలేవు. అవి జీవితంలో భిన్న కోణాలు. వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై, అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా, ఆధ్యాత్మికతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కానీ, బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.
మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం. అది ఈ పరిధికి చెందినది కాదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి మాట్లాడుతుంటారు. అటువంటిదేమీ లేదు. శాంతి అన్నది భౌతికమైనది, మానసికమైనది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైనదాన్ని కలత పెట్టవచ్చు. ఈ రెండూ కాని ఆధ్యాత్మికతను కలత పెట్టలేరు. అది శాంతిని కోరదు, దానికి శాంతి అవసరం కూడా లేదు. వీటన్నిటికీ అతీతమైన, అద్భుతమైన సాధనా మార్గం ఆధ్యాత్మికత.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The most misused word in this world is ‘spirituality’. 🌹
Sometimes due to ignorance, the word is used intentionally many times. Are being exploited or abused. However, some are creating uncertainty. Even after walking that path for many years, many still find it very ambiguous and misunderstood. It is for this reason that many doubts arise in their minds.
Everything we think in our mind is not spiritual. You do not have spiritual thoughts. Everything you think about God, about heaven, about salvation does not seem spiritual. Not all mental thoughts are spiritual. What if I was told I had a spiritual little finger? The finger is always physical. I can customize my body, my little finger, as a convenient tool for the spiritual process. Ultimately it is not spiritual. It's only physical.
Materialism is not the opposite of spirituality. The physical body is only a basic path to spirituality. Similarly the mental and emotional can also not be spiritual. They are different aspects of life. There is nothing wrong with that. It all depends on how we use them. We can use this body as a barrier, a trap or a gateway. Similarly this mind can be used as a machine for creating sorrow and as an instrument for spirituality. But, mind, body, emotion cannot be spiritual.
When we say spirituality we are talking about another dimension that is not physical. It does not fall into this category. If one is looking for peace of mind it is not spirituality. People talk about spiritual serenity. There is no such thing. Peace is physical, mental. You can upset the physical, the mental. Neither of these can upset Spirituality. It does not seek peace, it does not even need peace. Spirituality is the transcendent, wonderful path to all of this.
🌹 🌹 🌹 🌹 🌹
07 Apr 2022
Wednesday, April 6, 2022
Osho Daily Meditations - 164. THE ALCHEMY OF LOVE / ఓషో రోజువారీ ధ్యానాలు - 164. ప్రేమ యొక్క రసవాదం
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 164. ప్రేమ యొక్క రసవాదం 🍀
🕉. ప్రేమ దైవికమైనది. భూమిపై ఏదైనా దైవంగా ఉంటే, అది ప్రేమయే. ప్రేమ మిగతా అన్నింటినీ దైవీకరిస్తుంది. ప్రేమ అనేది జీవితానికి నిజమైన రసవాదం, ఎందుకంటే అది మూల లోహాన్ని బంగారంగా మారుస్తుంది. 🕉
ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలో చాలా పురాతన కథలు ఉన్నాయి. ఎవరో కప్పను ముద్దుపెట్టు కుంటారని మరియు కప్ప యువరాజుగా మారుతుందనే లాంటివి. కప్ప శపించ బడింది; అతను కేవలం తనపై ముద్దుల వర్షం కురిపించే వరకు వేచి ఉన్నాడు. ప్రేమ వచ్చి తనలో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ప్రేమ రూపాంతరం చెందుతుంది - అదే ఆ కథలన్నింటికీ సందేశం. కథలు అందంగా, చాలా సూచనాత్మకంగా, ప్రతీకాత్మకంగా ఉన్నాయి. జంతువును మనిషిగా మార్చేది ప్రేమ మాత్రమే; కాకపోతే మనుషులకు, ఇతర జంతువులకు తేడా ఉండదు.
ఒకే తేడా, సాధ్యమయ్యే తేడా ప్రేమ మాత్రమే. మీరు ప్రేమ ద్వారా ఎంత ఎక్కువగా జీవిస్తారో, అంటే ప్రేమగా జీవిస్తారో, అప్పుడు మీలో మానవత్వం పుడుతుంది. అంతిమ రస బిందువు అది. ఒకరు ప్రేమగా మారినప్పుడు అతీతుడు అవుతాడు. జంతువు మాత్రమే కాదు, మానవుడు కూడా. అప్పుడు దైవంగా, దేవుడుగా మారతారు. మానవ ఎదుగుదల అంతా ప్రేమ ఎదుగుదల. ప్రేమ లేకుంటే మనం జంతువులం. ప్రేమతో మనం మనుషులం. మరియు ప్రేమ మీ సహజ జీవిగా, మీ రుచిగా మారినప్పుడు, మీరు దేవుడు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 164 🌹
📚. Prasad Bharadwaj
🍀 164. THE ALCHEMY OF LOVE 🍀
🕉 Love is divine. If anything is divine on the earth, it is love and love also makes everything else divine. Love is the true alchemy of life, because it transforms base metal into gold. 🕉
There are ancient stories, many stories in almost all the languages of the world, that somebody kisses a frog and the frog becomes a prince. The frog had been cursed; he was simply waiting for some kiss to be showered on him. He was waiting for love to come and transform him. Love transforms-that is the message of all those stories. The stories are beautiful, very indicative, symbolic. It is only love that transforms the animal into the human; otherwise there is no difference between humans and other animals.
The only difference, the possible difference, is love. And the more you live through love, as love, the more humanity is born in you. The ultimate, the omega point, is when one has become love. Then not only is the animal transcended, even the human is transcended. Then one is divine, one is God. The whole of human growth is love's growth. Without love we are animals. With love we are human. And when love has become your natural being, your very flavor, you are God.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Apr 2022
Tuesday, April 5, 2022
DAILY WISDOM - 260 - 16. The Perception of Primary Qualities / నిత్య ప్రజ్ఞా సందేశములు - 260 - 16. ప్రాథమిక గుణాల అవగాహన
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 16. ప్రాథమిక గుణాల అవగాహన 🌻
'స్ధలం, కాలం మరియు దేవత' అనే తన పుస్తకంలో, శామ్యూల్ అలెగ్జాండర్ వివరించిన వ్యవస్థలో ఆధునిక భౌతిక శాస్త్రం మతపరమైన దిగుమతిగా ప్రత్యేకంగా చెప్పబడింది. అలెగ్జాండర్ సాపేక్షత సిద్ధాంతం నుండి సేకరించిన వివరాల ప్రకారం విశ్వ పదార్ధం యొక్క మాతృక స్ధలం, కాలం. ఈ స్ధలము-కాలము ప్రతిదానికి చలనం మరియు శక్తిని కలిగిస్తుంది. పొడవు, వెడల్పు మరియు ఎత్తు, పదార్ధం, వస్తు పరిమాణం మరియు స్వభావం వంటి ప్రాథమిక లక్షణాల యొక్క త్రిమితీయ చిత్రాన్ని తెస్తుంది.
ఈ ప్రాథమిక లక్షణాల యొక్క అవగాహన అనేది ఒక విధమైన చర్య-ప్రతిస్పందన ప్రక్రియ కారణంగా ఉత్పన్నమయ్యే ద్వితీయ లక్షణాల ద్వారా జరుగుతుంది. ఇవి గ్రహణ వస్తువు యొక్క ప్రాథమిక నాణ్యత మరియు దానిని గ్రహించే మనస్సు మధ్య గ్రహించ బడుతున్నాయి. ఒక ఉదాహరణను ఉదహరించాలంటే, ఆకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఆకు యొక్క అంతర్గత నిర్మాణంలోని అన్ని ఇతర లక్షణాలు మినహాయించి కేవలం దానిలో స్వయం చాలకంగా జరిగే పచ్చదనం అని పిలువబడే లక్షణాల సంగ్రహణ కారణంగా కనిపిస్తుంది. ఇతర రంగులు మరియు వస్తువుల రూపాల విషయంలో కూడా అలాగే ఉంటుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 260 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 16. The Perception of Primary Qualities 🌻
The specially religious import of modern physical science is highlighted also in the system of Samuel Alexander, which he purports to explain in his book entitled “Space, Time and Deity”. According to Alexander, space-time is the matrix of all things, the very substance of the universe, a clue that he gathers from the Theory of Relativity. The space-time matrix causes motion and force, and brings about the three-dimensional picture of what are known as primary qualities, like length, breadth and height, substance, volume and content.
The perception of these primary qualities happens to be through the secondary qualities arising as a sort of action-reaction process obtaining between the object of perception, namely, a primary quality and the perceiving mind. To cite an instance, a leaf looks green in colour not because there is such a thing called greenness in nature itself, but because of an abstraction of properties automatically taking place in the internal structure of the leaf excluding all other characteristics in nature apart from what looks like green. So is the case with other colours and forms of objects.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Apr 2022
Monday, April 4, 2022
Osho Daily Meditations - 163. BEING HURT / ఓషో రోజువారీ ధ్యానాలు - 163. బాధ పడడం
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 163. బాధ పడడం 🍀
🕉. లక్షలాది మంది ప్రజలు సున్నితంగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు . ఎవరి చేతనైనా బాధింప పడకుండా ఉండేందుకు వారు తమ చుట్టూ మందపాటి చర్మాలను పెంచుకున్నారు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది. వారిని ఎవరూ బాధించ లేరు, కానీ వారిని సంతోష పెట్టలేరు కూడా. 🕉
మీరు తెరుచు కోవడం ప్రారంభించినప్పుడు, మీకు రెండు అందుబాటులోకి వస్తాయి: ఆకాశం కొన్నిసార్లు మేఘావృతమై ఉంటుంది మరియు కొన్నిసార్లు సూర్యుడు ఉంటుంది. కానీ మీరు మీ గుహలో మూసి వేయబడి ఉంటే, అప్పుడు మేఘం లేదు మరియు సూర్యుడు కూడా లేడు. బయటికి రావడం, సూర్యునితో నృత్యం చేయడం మంచిది. అవును, కొన్నిసార్లు మేఘాలతో బాధపడటం కూడా ఉంటుంది. కొన్నిసార్లు చాలా గాలి వీస్తుంది. మీరు గుహ నుండి బయటకు వచ్చినప్పుడు, అన్ని విషయాలు సాధ్యమే. ఒక విషయం ఏమిటంటే ప్రజలు మిమ్మల్ని బాధపెడతారు ... కానీ అనేకంలో ఇది ఒకటి మాత్రమే.
దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. లేకపోతే మీరు మళ్లీ మూసివేయ బడతారు. మిలియన్ల కొద్దీ ఇతర అవకాశాలు ఉన్నాయి మీరు ఉండడానికి. ఆ విషయాల గురించి కూడా ఆలోచించండి. మీరు సంతోషంగా ఉంటారు; మీరు మరింత ప్రేమగా ఉంటారు. నేను అందరికి మరింత అందుబాటులో ఉండగలను, ఇతరులు కూడా నాకు మరింత అందుబాటులో ఉంటారు ఇలాంటి ఆలోచనలు చేయండి. మీరు నవ్వగలరు, మీరు పండుగ జరుపుకోగలరు. ఇలాంటి వెయ్యి ఒక్క అవకాశాలు ఉన్నాయి మీరు బాధ పడకుండా, భిన్నంగా ఉండడానికి. ప్రజలు మిమ్మల్ని బాధపెట్టే ఒకే ఒక్క విషయాన్ని ఎందుకు ఎంచుకోవాలి?
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹




























